Back
Link copied to clipboard!
Ink Politics

కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయం: బిఆర్ఎస్ vs కాంగ్రెస్, అసలు ఏం జరగబోతోంది?

July 14, 2026
కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయం: బిఆర్ఎస్ vs కాంగ్రెస్, అసలు ఏం జరగబోతోంది?

కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయకపోవడంపై బిఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా, ఎన్‌డీఎస్ఏ రిపోర్టుతో కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది!

కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్ చేసి ఎత్తిపోయడం ద్వారా సాగుకు, తాగడానికి నీళ్లు ఇవ్వచ్చని, రేవంత్ రెడ్డి అహంకారానికి పోయి, పంపులు ఆన్ చేయక పోవడంతో లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథాగా కిందికి పోతున్నాయని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉన్న మాట వాస్తవం. ఒకవేళ పంటలు ఎండిపోయి, రైతులకు నష్టం జరిగితే, ఆ కరువును కాంగ్రెస్ పైకి నెట్టేందుకు బిఆర్ఎస్ వ్యూహం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే "కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు" అని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి.. నా చేతిలో ఏం లేదు, అంతా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) దగ్గరే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ముట్టుకునే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే ఎన్‌డీఎస్ఏ దగ్గర మొర పెట్టుకోండిని చెప్తున్నారు. గేట్లు మూయకుండా కూడా ఎత్తిపోయవచ్చన్న రిటైర్డ్ ఇంజనీర్ల వాదనను కూడా సీఎం కొట్టిపారేశారు. నీళ్లు నిల్వ చేయకుండా ఎత్తిపోయలేమని, ఒకవేళ నీళ్లు నిల్వ చేస్తే ఆ బ్యారేజీలు కొట్టుకుపోతాయని NDSA చెప్పిందని రేవంత్ రెడ్డి వాదన. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకున్నా పంటలు పండితే, కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ అని చూపించవచ్చు. కాళేశ్వరం మోటర్లు నడవకుండా తెలంగాణలో రైతులు పంటలు పండించగలిగారని, ఇన్ని రోజులు బిఆర్ఎస్, కేసీఆర్ మనల్ని మోసం చేశారని కాంగ్రెస్ నిరూపించవచ్చు. ఈ రెండు పార్టీలలో ఎవరు నెగ్గుతారో.. ఎవరు ఓడుతారో రాబోయే రోజుల్లో తేలిపోనుంది. ఏది ఏమైనా నీళ్ల విషయంలో ప్లాన్ బి లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రతికూలంగా మారనుంది. ఒకవేళ తాగునీటి సమస్యలు వచ్చినా, సాగునీరు లేక పంటలు ఎండినా, అది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రజలకు 2027 ఫిబ్రవరి తరువాత తెలుస్తుంది.

Vamshi BTech

ఈ వార్తను మీ మిత్రులతో పంచుకోండి!

ఇలాంటి మరిన్ని వార్తలు, రాజకీయ విశ్లేషణల కోసం ఇన్క్ తెలంగాణను ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి మాకు మద్దతు తెలపండి.