Ink Mini News

Quick, shareable updates.

News Update
Ink MiniNews Update
July 07, 2026

ఈ వ్యాధికి మన దేశంలో మెడిసిన్ లేదు. ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు.

రెండు నెలల పసిబాబుకు ప్రాణాంతకమైన 'స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్ 1' వ్యాధి నిర్ధారణ. ఈ కారణంగా బాబు కండరాలు రోజురోజుకూ క్షీణిస్తూ, శ్వాస వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పసిప్రాణాన్ని కాపాడడానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ₹17 కోట్ల Zolgensma ఇంజెక్షన్ అవసరం. బాబు తల్లిదండ్రులు Milaap క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించి, దాతలు, ప్రభుత్వం సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు.

www.inktelangana.com
News Update
Ink MiniNews Update
July 05, 2026

సుమారు లక్ష అక్రమ పింఛన్లు కట్..!

తెలంగాణ చేయూత పింఛన్ల లైవ్ అథెంటికేషన్ ద్వారా దాదాపు సుమారు లక్ష అక్రమ పింఛన్లను అధికారులు గుర్తించారు. ఇందులో 63,532 మంది మరణించగా, 27,158 మందికి అడ్రస్ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల మంది పింఛన్ దారులు ఉండగా, 19 లక్షల మందికి DBT ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతోంది. సుమారు 5,000 మంది ఇతర రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారు. ఆధార్, బయోమెట్రిక్ సమస్యలున్న 45 వేల మందికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో కొత్తగా 3 లక్షల మందికి పింఛన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.

www.inktelangana.com